- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
34 వేల ఏళ్ళైనా చెక్కుచెదరని కళేబరం
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఉత్తర కెనడా, యుకాన్ ప్రాంతంలోని డాసన్ సిటీ సమీపంలో 57 వేల ఏళ్ల కిందటి చెక్కుచెదరని తోడేలు కళేబరం ఒకటి లభ్యమైంది. తాజాగా రష్యాలోని సెర్బియా ప్రాంతంలో 34 వేల ఏళ్ల కిందటి ఉన్ని ఖడ్గమృగం అవశేషాలు బయటపడ్డాయి. కాగా, ఆ అవశేషాలపై పరిశోధనలు జరిపేందుకు సైంటిస్టులు వాటిని ల్యాబ్‌కు పంపారు. అయితే ఈ ఉన్ని ఖడ్గమృగం శిలాజ అవశేషాలు ఇన్ని ఏళ్ల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉండటం పట్ల సైంటిస్టులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఖడ్గ మృగాన్ని ఎవరో జాగ్రత్తగా భద్రపరిచారని చెబుతున్నారు.
ఈ ఉన్ని ఖడ్గమృగం మూడు లేదా నాలుగేళ్ల వయసులో చనిపోయి ఉంటుందని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్.. పాలియోంటాలజిస్ట్(శిలాజ అవశేషాలపై పరిశోధనలు జరిపే శాస్త్రవేత్త) వలరి ప్లాట్నికొవ్ వెల్లడించారు. కాగా ఈ కళేబరం 20 వేల నుంచి 50 వేల ఏళ్ల కిందటిది కావొచ్చని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఖడ్గమృగం ఎన్నేళ్ల కిందటిది? అనేది రేడియోకార్బన్ స్టడీస్ ద్వారా పర్ఫెక్ట్‌గా తెలుస్తుందని అంటున్నారు. రష్యా, అబ్యిస్క్ జిల్లాలోని తీరేఖ్యాఖ్ నది తీరాన ఈ ఉన్ని ఖడ్గ మృగ కళేబరాలు లభ్యమయ్యాయి. దీనికి ‘సాష’గా నామకరణం చేసిన శాస్త్రవేత్తలు.. గ్లోబల్ వార్మింగ్ వల్ల శాశ్వత మంచు మెల్ల మెల్లగా కరిగిపోతున్నదని, తద్వారా మంచులోపల దాగి ఉన్న ఇలాంటి శిలాజ అవశేషాలు బయటపడుతున్నాయని తెలిపారు.