వెంకీ మామ@34

by Shyam |   ( Updated:2020-08-14 08:00:11.0  )
వెంకీ మామ@34
X

టాలీవుడ్ హీరో దగ్గుబాటి వెంకటేశ్..సినీ ప్రస్థానంలో విజయాల పరంపర కొనసాగిస్తూ..విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ప్రేమ నగర్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకీ..1986లో ‘కలియుగ పాండవులు’ మూవీతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకున్న వెంకీ కెరీర్‌లో ఎన్నో మైలు రాళ్లు. తర్వాత స్వర్ణ కమలం, ప్రేమ చిత్రాలకు కూడా నంది అవార్డు అందుకున్న వెంకీ మామ బ్రహ్మ పుత్రుడు చిత్రానికి బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అందుకున్నాడు. ఇప్పటివరకు 74 సినిమాలు చేసిన వెంకీ..ఎన్నో చాలెంజింగ్ పాత్రలను చేసి మెప్పించాడు. తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ సక్సెస్ అందుకున్న విక్టరీ వెంకటేశ్..అత్యధిక నంది అవార్డులు పొందిన అక్కినేని నాగేశ్వర్ రావు రికార్డును సమం చేశాడు.

ధర్మచక్రం, గణేష్, రాజా, జయం మనదేరా, సూర్యవంశం, సంక్రాంతి, ఘర్షణ, మల్లీశ్వరి లాంటి చిత్రాలతో నటుడిగా అన్ని యాంగిల్స్ చూపించిన వెంకీ మల్టీ స్టారర్ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గోపాలా గోపాలా, F2, వెంకీ మామ లాంటి చిత్రాలతో సూపర్ కో యాక్టర్‌గా ప్రశంసలు అందుకున్న వెంకీ..ఇప్పుడు నారప్పతో అలరించేందుకు సిద్ధం అయ్యారు. వెంకీ సినీ ప్రస్థానం ప్రారంభించి 34 ఏండ్లు కాగా, శుక్రవారం స్పెషల్ ట్వీట్ చేశాడు. కలియుగ పాండవులు సినిమాతో కథానాయకుడిగా కెరీర్ ఆరంభించిన వెంకీ..దర్శకుడు రాఘవేంద్ర రావు, తండ్రి దగ్గుబాటి రామానాయుడు‌కు ధన్యవాదాలు తెలిపారు. ఫస్ట్ అమేజింగ్ కో యాక్టర్ ఖుష్బూ సుందర్‌కు థాంక్స్ చెప్పిన వెంకీ..బ్యూటిఫుల్ మెమోరీ అందించిన సురేష్ ప్రొడక్షన్స్‌కు, మూవీ యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story