దేశంలో 3,20,922 కరోనా కేసులు

by vinod kumar |
దేశంలో 3,20,922 కరోనా కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఉధృతమవుతోంది. ఒక రోజును మించి మరుసటి రోజు అధికంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం బులెటిన్ వెల్లడించే సరికి గడిచిన 24గంటల్లో ఏకంగా 11,929 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా దేశంలో ప్రవేశించినప్పటి నుంచి ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. దీంతో దేశంలో నమోదైన కేసుల సంఖ్య 3,20,922కు చేరింది. ఒక్కరోజే కరోనాతో 311 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 9,195కి చేరింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 1,62,379 మంది కోలుకోగా 1,49,348 మంది ఆస్పత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతోంది. దేశంలోనే ఇప్పటివరకు ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్రలో ఒక్కరోజే 3,390 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా రికార్డైన కేసులతో కలిపి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 1,07,958కి చేరింది. మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 120 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ముంబైలో ఒక్కరోజే 1,395 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఒక్కరోజే 79 మంది కరోనాతో మరణించారు. ముంబైలో మొత్తం కేసుల సంఖ్య 58,135కి చేరింది. ముంబైలో ఇప్పటివరకు కరోనాతో 2,190 మంది చనిపోయారు.

తమిళనాడులో ఒక్కరోజే 1,974 కొత్త కేసులు నమోదవడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 44,661కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఒక్కరోజే 38మంది మరణించడంతో ఇక్కడ ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 435కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజులో 2,224 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 41,182కు చేరింది. ఢిల్లీలో కరోనా బారిన పడి ఒక్కరోజే 56 మంది మరణించడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,327కి చేరింది. గుజరాత్‌లో ఒక్కరోజే 511 కొత్త కేసులు నమోదవగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,590కి చేరింది. రాష్ట్రంలో ఒక్కరోజే 29మంది కరోనాతో చనిపోవడంతో ఇప్పటివరకు ఇక్కడ వ్యాధి సోకి మరణించిన వారి సంఖ్య 1,478కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే కొత్తగా 253 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 4,841కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా ఇద్దరు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 84 మంది మరణించారు.

Advertisement

Next Story

Most Viewed