రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

by Sumithra |
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
X

దిశ, మెదక్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన సిర్గాపూర్ పరిధిలోని సుల్తానాబాద్ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంతర్గాంకు చెందిన సంగం బాగయ్య (32) కామారెడ్డి జిల్లా పిట్లంకు బైక్ పై వెళ్తుండగా సుల్తానాబాద్ శివారులో ఓ మలుపు వద్ద బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బాగయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు స్థానిక ఎస్సై మొగులయ్య తెలిపారు.

Tags: road accident, medak, sulthanabad, SI mogulayya, crime,

Advertisement

Next Story