- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న మరో నిరుద్యోగి
దిశ, పరిగి: బీటెక్ వరకు చదివినా ఉద్యోగం రావడం లేదని ఓ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుల్కచర్ల ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన శివుని శ్రీనివాస్ (30) బీటెక్ పూర్తి చేశాడు. తన తండ్రి రాయయ్య 15 ఏళ్లక్రితమే చనిపోవడంతో తల్లి సత్తమ్మ కష్టపడి చదివించింది. శ్రీనివాస్ తో పాటు మరో ఇద్దరు కొడుకులు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పేద కుటుంబం కావడంతో కుటుంబ పోషణ భారైమంది. ఓ వైపు చదువుకున్నా ఉద్యోగం రాలేదు. ఇంత చదివినా ఉద్యోగం రాలేదని, ఇంకా పెళ్లి కూడా కాలేదని అనుకుంటున్నారంటూ మనస్థాపానికి గురయ్యేవాడు. మనోవేదనతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. సూసైడ్ నోట్ రాసి బుధవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లి సత్తమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.