- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.200లకు ఆశపడి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న 30 మంది..!
దిశ, జగిత్యాల : అధికంగా డబ్బులు వస్తాయనుకుంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎంతటి కష్టమైనా చేసేందుకు సిద్ధపడుతారు. ఇన్ని రోజులు కరోనా వలన లాక్‌డౌన్ విధించగా.. ఆదాయం లేక నిరుపేదలు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే పలు గ్రామాల్లో వ్యవసాయ కూలీలు దొరకడం లేదు. దీంతో కొందరు అధికంగా కూలి డబ్బులు ఇచ్చి పక్క గ్రామాల నుంచి మనుషులు పిలిపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రూ.200 అధికంగా కూలి డబ్బులు ఇస్తామని చెప్పడంతో వెళ్లిన 30 మంది గ్రామస్తుల జీవితాలు రిస్కులో పడ్డాయి. అనుకోకుండా వీరంతా కరోనా బారిన పడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం మదుట్లలో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో జగిత్యాల జిల్లాలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. అయితే, మల్యాల మండలం మద్దుట్ల గ్రామంలో ప్రస్తుతం రూ.300 దినసరి వ్యవసాయ కూలీ ఇస్తున్నారు. పక్క గ్రామాలైన తాటిపల్లి, అల్లిపూర్, ఇతర గ్రామాల్లో రూ.500 ఇస్తున్నారని తెలియడంతో మద్దుట్లకు చెందిన అనేక మంది మహిళలు, పురుషులు గుంపులు గుంపులుగా కూలి పని నిమిత్తం ఆటోల్లో ఇతర గ్రామాలకు నాట్లు వేసేందుకు వెళ్తున్నారు. ప్యాసింజర్ ఆటోలో అధిక సంఖ్యలో ప్రయాణించడం వలన కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందినట్లు సమాచారం. తొలుత కూలి పనులకు వెళ్లిన వారిలో 10 మందికి జ్వరం, జలుబు వంటి కొవిడ్ లక్షణాలు కనిపించాయి. వారికి కొవిడ్ టెస్టులు చేయించగా నలుగురికి పాజిటివ్ తేలింది. అప్రమత్తమైన సర్పంచ్ మల్లవ్వ మల్యాల మెడికల్ ఆఫీసర్ లావణ్యతో మాట్లాడి గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించి.. 130 మందికి కరోనా పరీక్షలు చేయించగా అందులో 29 మందికి పాజిటివ్ నిర్దారణ జరిగింది. వీరంతా పక్క ఊళ్లలో వరి నాట్లకు వెళ్తున్నవారే. దీంతో సర్పంచ్ గ్రామంలో స్వచ్ఛంద లాక్ డౌన్ విధించారు. పాజిటివ్ వచ్చిన వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచారు. బాధితుల ఇండ్ల చుట్టూ శానిటేషన్ చేయిస్తున్నారు.
మంగళవారం 130 మందికి నిర్వహించిన టెస్టుల్లో 29 మందికి పాజిటివ్ రాగా.. తిరిగి బుధవారం గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గ్రామస్తులు పరీక్షల కోసం బయటకు రాకపోవడంతో కేవలం 50 మందికి టెస్టులు చేయగా, ఒకరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. అయితే, గ్రామంలో వైద్య సిబ్బందితో సర్వే చేయించి కరోనా లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని సర్పంచ్ తెలిపారు. కరోనా సోకిన వారిలో 11 ఏళ్లలోపు చిన్నారి కూడా ఉండటం విశేషం.
ఆటోలు బంద్ :
సర్పంచ్ మల్లమ్మ మాట్లాడుతూ.. మద్దుట్లలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంతో గ్రామ పంచాయతీ పరిధిలో సెల్ఫ్ లాక్‌డౌన్ విధించినట్లు తెలిపారు. ఇకపై గ్రామంలో ఎవరూ ఆటోలను నడపరాదనే షరతు పెట్టామన్నారు. ఎవరైనా నిబంధనలను విస్మరిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని ముందుస్తుగా వెల్లడించారు. దుకాణాలు, హోటల్స్ ఇతర షాపులు ఉదయం 8 గంటల వరకు తెరిచి ఉంచాలని.. ఆ తర్వాత లాక్‌డౌన్ ఉంటుందని సర్పంచ్ స్పష్టంచేశారు.