కర్నూల్ జిల్లాలో విషాదం… డయేరియాతో 30 మందికి అస్వస్థత

by srinivas |   ( Updated:2021-04-07 04:26:45.0  )
కర్నూల్ జిల్లాలో విషాదం… డయేరియాతో 30 మందికి అస్వస్థత
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూల్ జిల్లాలో జరుగుతున్న దేవర ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. ఉత్సవాల్లో కలుషిత నీరు తాగి ఒకరు మృతి చెందారు. వివరాలలోకి వెళితే ఆదోని పట్టణంలోని అరుణ్‌ జ్యోతి నగర్‌లో మంగళవారం దేవర ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఆ ఉత్సవాల్లో కలుషిత నీరు తాగిన 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారందరిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బాధితులతో ఆదోని ఏరియా ఆసుపత్రి కిటకిటలాడింది. వీరిలో ఒకరు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా పాణ్యం మండలం గోరుకల్లు లో అతిసార కు గురై ఇద్దరు మృతి చెందారు. గత మూడు రోజులుగా గోరుకల్లు నుంచి కలుషిత నీరు సరఫరా కావడం వల్లే వీరు అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. గత రెండు రోజులుగా ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులందరినీ మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్జివి కృష్ణ, అసిస్టెంట్‌ కమిషనర్‌ మధుసూదన్‌ రెడ్డి పరామర్శించారు.

Advertisement

Next Story

Most Viewed