నల్లమలలో ఒక్కరోజే 30 కరోనా కేసులు

by vinod kumar |
నల్లమలలో ఒక్కరోజే 30 కరోనా కేసులు
X

దిశ, అచ్చంపేట: నల్లమల ప్రాంతంలో శనివారం ఒక్కరోజే 30 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. నియోజకవర్గంలోని అచ్చంపేట పట్టణంలో 20 కేసులు నమోదు కాగా, ఇదే మండలంలో చందాపూర్ గ్రామం లో ఒకరికి, అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో ఇద్దరికీ, ఇదే మండలంలోని ప్రశాంత్ నగర్ కాలనీలో ఒకరికి పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు మండలాలతో పాటు బల్మూర్, లింగాల, ఉప్పునుంతల మండలాల్లో కూడా కేసులు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అచ్చంపేట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఒక రోజు వారిగా తన వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాదు వెళ్లి వస్తున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలోనే అతనికి కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు గుర్తించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలలో నమోదైన పాజిటివ్ కేసులు వారి ప్రాథమిక కాంటాక్ట్లను సేకరించే పనిలో వైద్య సిబ్బంది నిమగ్నమయ్యారు. పాజిటివ్ కేసులు నమోదైన గ్రామాలలో గ్రామ సర్పంచులు, ఆశ వర్కర్లు మరియు వైద్య సిబ్బంది శానిటైజర్ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుర్తుచేస్తున్నారు. కేసులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించినప్పుడే కరోనాను మన దరికి చేరకుండా జాగ్రత్త పడవచ్చు అని వైద్యులు గుర్తుచేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో కేసులు మరింతగా పెరుగుతుండడంతో ప్రజలు మరింత అప్రమత్తతతో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కేసులు ఎన్ని పెరుగుతున్నప్పటికీ ముందు వరుసలో నిలబడి సేవలు చేస్తున్న ఆశ వర్కర్లు మరియు వైద్య సిబ్బందిని ప్రజలు ప్రశంసిస్తున్నారు.

Advertisement

Next Story