- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగ్గురికి ఒక్కడే.. పాత బస్సులో అమ్మాయిల న్యూ జర్నీ..
దిశ, ఫీచర్స్ : ప్రస్తుత రోజుల్లో ప్రేమించుకోవడం ఎంత సాధారణమో, విడిపోవడం కూడా అంతే సహజంగా మారిపోయింది. అలానే ఒకే సమయంలో ఇద్దరు, ముగ్గురితో ప్రేమయాణం సాగించడంలోనూ తప్పు లేదంటోంది నేటి యువతరం. ఇలానే ఓ యువకుడు ఎట్ ఏ టైమ్ పలువురితో లవ్‌స్టోరీలు కొనసాగించాడు. ఆ విషయం తన ఇష్టసఖులకు తెలిసింది. అందులో ఓ ముగ్గురు ప్రియురాళ్లు అతడికి బ్రేకప్ చెప్పారు. ఇందులో విశేషం లేదు కానీ ఆ ముగ్గురు మంచి మిత్రులుగా మారిపోయారు. అంతకుమించి తమ జీవితాన్ని, స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు క్రాస్ కంట్రీ ట్రిప్‌కు వెళ్లారు. వారి ‘హ్యాపీ జర్నీ’ని అందరికీ వివరించేందుకు ‘బామ్ బస్’ పేరుతో ఇన్‌స్టా, టిక్‌టాక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. సినిమా స్టోరీని తలపిస్తున్న ఈ రియల్ లైఫ్ ఇన్సిండెంట్ విశేషాలు మరింత క్లియర్‌గా తెలుసుకుందాం!
అమెరికాకు చెందిన బెకా కింగ్, అబి రాబర్ట్స్, మోర్గాన్ టాబోర్‌లు ఒకే వ్యక్తితో డేటింగ్ చేస్తున్నారని విషయాన్ని తెలుసుకున్నారు. అయితే వీళ్లు ఎలా గుర్తించారనే విషయం తెలుసుకోవాలంటే.. మనం ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాలి. 2020 డిసెంబర్‌లో టాబోర్ పలు సోషల్ మీడియా అకౌంట్స్ సెర్చ్ చేస్తున్న సమయంలో తన బాయ్‌ఫ్రెండ్, వేరే అమ్మాయితో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు ఆమెకు కనిపించాయి. దాంతో ఆమె షాక్ కావడంతో పాటు, చాలా బాధపడింది. ఈ క్రమంలోనే టాబోర్‌కు తన ప్రియుడిపై అనుమానం పెరిగింది. దాంతో టాబోరే మరింత పరిశోధించగా రాబర్ట్స్, కింగ్ ప్రొఫైల్స్ కూడా బయటకురావడంతో పాటు, తన బాయ్‌ఫ్రెండ్ ఆరుగురికిపైగా మహిళలను మోసం చేస్తున్నాడని తేలింది. వీరిలో ఎక్కువ మంది తమతో మాత్రమే ప్రత్యేకమైన సంబంధముందని భావించారు! ముగ్గురు సోషల్ మీడియాలో కలిశారు. మాట్లాడుకున్నారు. వారి అనుభవాలతో బాధను, ఏడుపును ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఈలోగా వారి బాయ్‌ఫ్రెండ్ టాబోర్ ఇంటికి రాగా, వీడియోకాల్‌లో మిగతా ఇద్దరిని కూడా పరిచయం చేసింది ఆమె. అప్పటికీ ఆ వ్యక్తి తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు. మారతానని చెప్పినప్పటికీ ముగ్గురు కూడా అతడి మాటలను మరోసారి నమ్మదలుచుకోలేదు. వెంటనే బ్రేకప్ చెప్పేశారు. ఇక ఈ సంఘటనతో స్నేహితులుగా మారిపోయిన బెకా కింగ్, అబి రాబర్ట్స్, మోర్గాన్ టాబోర్ తమ స్నేహానికి గుర్తుగా అద్భుతమైన కొత్త జీవితానికి పునాదిగా ‘రోడ్ ట్రిప్’ ప్లాన్ చేశారు. అమెరికా అంతటా తిరిగాలని ప్లాన్ చేశారు.
తమ న్యూ జర్నీ కోసం ఆ ముగ్గురు యువతులు ఓ పాత బస్సును తీసుకుని, దాన్ని చాలా అందంగా రెనోవేట్ చేసుకున్నారు. బెడ్స్, కిచెన్ సామగ్రితో బ్యూటీఫుల్‌గా దాన్ని డెకోరేట్ చేశారు. ఆ బస్‌కు తమ ఇంటిపేర్లలోని మొదటి అక్షరాలతో కలిసి ‘బామ్ బస్’ అని పేరు పెట్టారు. టిక్‌టాక్, ఇన్‌స్టాలో అదే పేరుతో అకౌంట్స్ తెరిచి వారి జర్నీ విషయాలు పంచుకుంటున్నారు. ఈ ముగ్గురి అద్భుతమైన కథ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. సమ్మర్ సీజన్ అయిపోయే వరకు తాము టూర్ ప్లాన్ చేసినా, ప్రస్తుతం తమకు సాధ్యమైనంత ఎక్కువ కాలం తమ జర్నీని కొనసాగించాలని యోచిస్తున్నారు.