ఇవాళ ముగ్గురు హతం.. మొత్తం 10 మంది

by Anukaran |
ఇవాళ ముగ్గురు హతం.. మొత్తం 10 మంది
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాల చేతిలో ఆదివారం ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకాశ్మీర్ లోని పంథా చౌక్ చెక్ పోస్ట్ వద్ద భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి పరారయ్యారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులతో కలిసి ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించాయి.

ఈ క్రమంలో ఉగ్రవాదులు మరోసారి కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు కూడా వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉద్రవాదులు మృతిచెందారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. కాగా, గత మూడు రోజుల్లో భద్రతా బలగాల చేతుల్లో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక ఉగ్రవాది లొంగిపోవడంతో అతడిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story