కరెంటు షాక్​తో ముగ్గురి మృతి

by srinivas |
కరెంటు షాక్​తో ముగ్గురి మృతి
X

దిశ, ఏపీ బ్యూరో: కరెంటు షాక్​తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శనివారం నెల్లూరులో చోటుచేసుకుంది. కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డ్ ఎంఐజీలో కాలనీలో ఓ నివాసం గేటుపై 11 కేవీ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీన్ని గమనించని ఇంటి యజమాని వేణుగోపాల్ (56) ఒక్కసారిగా విద్యుత్‌ షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. భర్తను రక్షిద్దామని వెళ్లిన భార్య మరియమ్మ(52), తల్లి బుజ్జమ్మ(70) వేణుగోపాల్‌ చేయి పట్టుకోవడంతో విద్యుత్​షాక్​కు గురై అక్కడికక్కడే మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో కాలనీలో విషాద చాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story