మాస్క్ లేకుంటే రూ.3 లక్షల ఫైన్!

by vinod kumar |
మాస్క్ లేకుంటే రూ.3 లక్షల ఫైన్!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది.ఆయా ప్రభుత్వాలు కరోనా నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం దక్కడం లేదు. మాస్క్ లేకుండా బయట తిరగడమే వైరస్ వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. ఈ విషయం గుర్తించిన యూకే ప్రభుత్వం మాస్కు లేకుండా బయట తిరిగితే భారీ ఫైన్‌లు విధించాలని నిర్ణయించింది. ఇంతకుమందు వరకు మాస్క్ లేకుండా బయటకు వస్తే 100పౌండ్లు జరిమానా వేసేవారు. ఈ మొత్తాన్ని 14 రోజుల్లోగా చెల్లిస్తే 50శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ విధానంతో ప్రజలు ఫైన్లు కడుతున్నారు కానీ, మాస్క్ ధరించడం లేదు.

దీంతో యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకుండా బయటకు వస్తే జరిమానాను 100పౌండ్ల నుంచి 3వేల పౌండ్లకు పెంచుతూ నిర్ణయించింది. మన దేశ కరెన్సీలో సుమారుగా రూ.3.14 లక్షలు అన్నమాట. ఇక వేడుకల్లో 30 మందికి మించి హాజరైతే నిర్వాహకులకు 10వేల పౌండ్లు జరిమానా విధిస్తామని యూకే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తే మరికొందరు విమర్శిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed