- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణకు భారీ వర్ష సూచన
రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర కోస్తా, కర్ణాటక నుంచి మరఠ్వాడ వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మరియు మధ్య మహారాష్ట్ర మీదుగా 0.9 km ఎత్తుతో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని తెలిపారు. దీని ప్రభావం వలన సోమవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు మరియు ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. ఆ సమయంలో గంటకు 30 నుండి 40కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఆదిలాబాద్, కోమురం భీం -ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్-(పట్టణ & గ్రామీణ), మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
tags : weather report, hyd, 3 days rain, expecting