28 నుంచి తెలుగు యూనివర్సిటీ పరీక్షలు..

by Shyam |
28 నుంచి తెలుగు యూనివర్సిటీ పరీక్షలు..
X

దిశ, తెలంగాణ బ్యూరో :

ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 28 నుంచి నిర్వహించనున్నట్లు తెలుగు యూనివర్సిటీ శనివారం ప్రకటించింది. ఎంసీజే, ఎంసీఏ, ఎంఏ, బీఎఫ్ఏ కోర్సుల ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు హాజరు కావాలని యూనివర్సిటీ సూచించింది.

అలాగే, కొవిడ్ పాజిటివ్ ఉన్న విద్యార్థులు పరీక్షలకు హాజరు కావొద్దని, వారికి మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని పరీక్షల విభాగం అధికారులు వెల్లడించారు. విద్యార్థుల సందేహాలు, పరీక్షల టైం టేబుల్ కోసం www.teluguuniversity.ac.inను సంప్రదించవచ్చని తెలిపారు.

Advertisement

Next Story