ఏపీలో కొత్తగా 2,745 పాజిటివ్ కేసులు

by Anukaran |
ఏపీలో కొత్తగా 2,745 పాజిటివ్ కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో గడిచిన 24 గంటల్లో 2,745 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,35,953కి చేరింది. వైరస్ బారిన పడి 13 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,757కు చేరింది. కాగా యాక్టివ్ కేసులు 21,878 ఉండగా డిశ్చార్జ్ కేసుల సంఖ్య 8, 07,318గా ఉంది. ఏపీలో ఇప్పటి వరకు 84,27,629 మందికి కరోనా టెస్టులను నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 85,364 మందికి కరోనా పరీక్షలను నిర్వహించారు.

Advertisement

Next Story