- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా టెస్టుల్లో 25% పాజిటివ్.. కొత్తగా 269 కేసులు
దిశ, న్యూస్ బ్యూరో: గడిచిన 24 గంటల వ్యవధిలో 1,096 కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే ఇందులో దాదాపు 25% పాజిటివ్‌గా తేలాయి. ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలో 214 నమోదుకాగా రంగారెడ్డి జిల్లాలో 13, వరంగల్ అర్బన్‌లో 10, కరీంనగర్‌లో 8, జనగాంలో 5 చొప్పున మొత్తం 269 కొత్త కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,675కు చేరుకుంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 65% మంది పురుషులు. కరోనా బారిన పడినవారిలో 26-30 ఏళ్ళ మధ్య వయసున్నవారు గరిష్టంగా 679 మంది ఉన్నారు. 30-40 ఏళ్ళ మధ్య వయసువారు 1,252 మంది ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం 192 మంది మృతిచెందగా 35 మందికి మాత్రమే మరే జబ్బులూ లేకుండా కేవలం కరోనాతో చనిపోయారని, అతి ఎక్కువ సంఖ్యలో హైపర్‌టెన్షన్ సమస్యతో ఉన్నవారు 71 మంది చనిపోయారి, రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ విడుదల చేసిన బులిటెన్ పేర్కొంది.
బులిటెన్‌లో మళ్ళీ తప్పుడు గణాంకాలు
గడచిన 24 గంటల వ్యవధిలో చేసిన కరోనా టెస్టులు, చికిత్స నుంచి కోలుకుని డిశ్చార్జి అయినవారి విషయంలో బులిటెన్‌లో తప్పుడు గణాంకాలు ఉన్నాయి. ఈ నెల 16న విడుదల చేసిన బులిటెన్‌లో మొత్తం 44,431 టెస్టులు చేసినట్లు పేర్కొనగా బుధవారం మాత్రం 1,096 టెస్టులు జరిగినట్టు పేర్కొంది. కానీ మంగళవారం లెక్కతో పోలిస్తే బుధవారం ఇచ్చిన గణాంకాలు సరిపోవడం లేదు. మంగళవారం రాత్రి నాటికి 3,027మంది డిశ్చార్జి అయినట్టు పేర్కొంటే బుధవారం మరో 151 మంది ఆసుపత్రి నుంచి ఇళ్ళకు చేరుకున్నట్టు పేర్కొంది. దీంతో మొత్తం డిశ్చార్జిల సంఖ్య 3,178కి చేరుకోవాలి. కానీ బులిటెన్‌లో మాత్రం 3,071 అని మాత్రమే పేర్కొంది.
బులిటెన్‌లలో తప్పుడు లెక్కలు ఉంటున్నాయని బుధవారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, రాత్రికి విడుదలైన బులిటెన్‌లో మరోసారి రిపీట్ అయింది. రెండు రోజుల బులిటెన్లను పరిశీలిస్తే మంగళవారం బులిటెన్‌లో నెగెటివ్ వచ్చినవారు 39,025 మంది ఉంటే బుధవారం కొత్తగా 827 మంది నెగెటివ్ కలిపితే 39,852కు బదులుగా 40,236 వచ్చినట్లు పేర్కొంది. మంగళవారం నాటికి యాక్టివ్ కేసులు 2,188 ఉంటే బుధవారం 151 మంది డిశ్చార్జి అయ్యి కొత్తగా 269 మంది చేరితే 2,306 మంది ఉండాల్సిన దానికి బదులుగా 2,412 అని బులిటెన్ పేర్కొంది. ఒకదానికి మరొకటి పొంతనలేని తీరులో గణాంకాలు వెల్లడవుతున్నాయి.