పెళ్లి చూపులకు వెళ్లొస్తుండగా ట్రాక్టర్ బోల్తా

by Shyam |
roed accident
X

దిశ, గుండాల: పెళ్లిచూపులకి వెళ్ళిన ట్రాక్టర్ బోల్తా పడటంతో 25 మంది గాయాలపాలయ్యారు. గుండాల మండలం కన్నాయిగూడెం గ్రామానికి చెందిన కల్కి రామయ్య కుమారునికి.. ఇదే మండలం నర్సాపురం గ్రామానికి చెందిన నరసింహారావు కుమార్తెకు వివాహం నిశ్చయించారు. ఈ క్రమంలోనే మంగళవారం పెళ్లి కూతురుకు బట్టలు పెట్టడం కోసం గుండాల నుండి నరసాపురం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో డ్రైవర్ అతివేగంతో ట్రాక్టర్ నడపడంతో ఒక్కసారిగా అదుపుతప్పింది. ట్రాక్టర్ బోల్తా పడి 25 మందికి గాయాలయ్యాయి.. బాధితులకు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు.

Advertisement

Next Story