గ్రేటర్‌లో మ.3గంటల వరకు పోలింగ్ శాతం ఎంతంటే ?

by Shyam |
గ్రేటర్‌లో మ.3గంటల వరకు పోలింగ్ శాతం ఎంతంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్‌లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. నగర ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపడం లేదు. దీంతో పోలింగ్ శాతం భారీగా తగ్గిపోయింది. ఉదయం 11గంటల వరకు 9శాతం వరకే నమోదైన పోలింగ్.. మధ్యాహ్నం 3గంటల వరకు 25.34శాతంగా ఉంది. రాజేంద్రనగర్‌లో 24.62 శాతం, చార్మినార్‌ 24.23, సంతోష్‌నగర్ 17.26, మలక్‌పేట 15.88, చాంద్రాయణగుట్ట 15.19, ఫలక్‌నుమా 17.61, మాదాపూర్ 22.70, మియాపూర్ 25.47, హఫీజ్‌పేట 20.98, చందానగర్ 21.42, కొండాపూర్ 19.64, గచ్చిబౌలి 26.56, శేరిలింగంపల్లి 23.24, సరూర్‌నగర్‌లో 26.61 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎస్‌ఈసీ పేర్కొంది.

Advertisement

Next Story