పంజాబ్‌లో 23 మంది ఎమ్మెల్యేలకు కరోనా

by Shamantha N |   ( Updated:2020-08-26 09:10:28.0  )
పంజాబ్‌లో 23 మంది ఎమ్మెల్యేలకు కరోనా
X

చంఢీగడ్: పంజాబ్‌లో మొత్తం 117 మంది ఎమ్మెల్యేలకుగాను 23 మంది కరోనా బారినపడ్డారని సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ వెల్లడించారు. శుక్రవారం సింగిల్ డే అసెంబ్లీ సెషన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలందరికీ కరోనా టెస్టులు నిర్వహించే డ్రైవ్ చేపడుతున్నారు. కరోనా నెగెటివ్ రిపోర్టు చూపించినవారికే అసెంబ్లీలోకి ప్రవేశముంటుందని ఎమ్మెల్యేలను సీఎం ఆదేశించారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 23మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఎమ్మెల్యేలు, మంత్రుల పరిస్థితే ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో ఎలా ఉందో ఊహించుకోవచ్చునని సీఎం అన్నారు. కరోనా సోకిన తొలి మంత్రి త్రిప్తి రాజేందర్ బజ్వా ఇటీవలే కోలుకోగా, సుఖ్‌జింద్ సింగ్ రంధవా, గుర్‌ప్రీత్ కంగార్, శాం సుందర్ అరోరాలతోపాటు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అజైబ్ సింగ్ భట్టికీ వైరస్ పాజిటివ్ తేలింది. కాంగ్రెస్ నుంచి ప్రగత్ సింగ్, మదన్‌లాల్ జలాల్‌పుర్, హర్ద్యాల్ కంబోజ్‌లు సహాపలువురికి కరోనా సోకగా, ఆప్ నుంచి మంజీత్ సింగ్ బిలాస్‌పుర్, కుల్వంత్ సింగ్ పండోరిలకు వ్యాపించింది. శిరోమణి అకాలీ దళ్ ఎమ్మెల్యేలు మన్‌ప్రీత్ సింగ్ అయాలీ, కన్వర్‌జీత్ సింగ్ సహాపలువురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed