- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాగ్దాద్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. 23మంది మృతి
బాగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని ఆల్ ఖతీబ్ ఆస్పత్రిలోని కరోనా ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో శనివారం రాత్రి ఘోర ఆగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. దీనిపై ప్రధాని ముస్తఫా అల్ ఖదీమీ సీరియస్ అయ్యారు. తక్షణమే దర్యాప్తునకు అధికారులను ఆదేశించారు.
ఈ విషయంపై సివిల్ డిఫెన్స్ మినిష్టర్ మేజర్ జనరల్ ఖాదీమ్ బోహన్ మీడియాతో మాట్లాడుతూ..ఆస్పత్రిలోని పల్మొనరీ వార్డులోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో మంటలు చెలరేగినట్టు తెలిపారు. ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 120 మంది ఉన్నారని.. వారిలో 90 మందిని కాపాడినట్టు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ఫైర్ యాక్సిడెంట్‌పై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.