- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వృద్ధులకు ఫైజర్ టీకా ప్రమాదకరం.. 23 మంది మృతి
ఓస్లో: వయో వృద్ధులు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి కొవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వడం చాలా ప్రమాదకరమని నార్వే తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఫైజర్ టీకా అనుమతుల కోసం సమీక్షిస్తున్న తరుణంలో యూరోపియన్ హెల్త్ అథారిటీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రభావాలపై దేశాలు అధ్యయనం చేసిన తరుణంలో యురోపియన్ హెల్త్ అథారిటీస్ అధికారులు ఈ ప్రకటన చేశారు. వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత అతి తక్కువ కాలంలోనే 23 మంది మృతిచెందారని నార్వే అధికారులు తెలిపారు. 13 మంది పోస్టుమార్టం నివేదికను పరిశీలించగా టీకా ఇచ్చిన తర్వాత తలెత్తే సాధారణమైన అలర్జీలు వయోవృద్ధుల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు అర్థమైందని నార్వేయిన్ మెడిసిన్స్ ఏజెన్సీ తెలిపింది.
ఆరోగ్యపరంగా అత్యంత బలహీనులపై వ్యాక్సినేషన్ ద్వారా కలిగే సాధారణ దుష్ప్రభావాలు ప్రాణాంతకం కావచ్చని నార్వేయిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ తెలిపింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కొద్దిపాటి ఉపశమనం కలుగవచ్చు లేదా అసలే ఉండకపోవచ్చని పేర్కొంది. అయితే, ఆరోగ్యవంతులు, యువకులకు వ్యాక్సిన్ ఇవ్వకూడదు అని ఎక్కడా సూచించడం లేదని చెప్పింది. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ చీఫ్ ఎమర్ కుక్ మాట్లాడుతూ ఇతర కొవిడ్ వ్యాక్సిన్ల కంటే ఆర్‌ఎన్‌ఏ మెసెంజర్ ఆధారిత టీకాలను పెద్ద ఎత్తున పంపిణీ చేయడం చాలా సవాళ్లతో కూడుకున్న విషయమని పేర్కొన్నారు. నార్వేలో వ్యాక్సినేషన అనంతర మరణాలపై నార్వేయిన్ రెగ్యులేటరీ సంస్థతో కలసి ఫైజర్/ బయోఎన్‌టెక్ కలసి పనిచేస్తున్నాయని ఫైజర్ సంస్థ ఈ-మెయిల్ సందేశంలో తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సంభవించిన సంఘటనలు అంత ఆందోళనకరమైనవి కావని, తమ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని స్పష్టం చేసింది.