- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిమ్మ, నారింజ తొక్కలతో ఎకో ఫ్రెండ్లీ గిఫ్ట్ ర్యాపర్
దిశ, ఫీచర్స్ : పెళ్లిళ్లు, పుట్టినరోజులతో పాటు పండుగలకు కానుకలివ్వడం పరిపాటే. అయితే గిఫ్ట్ ప్యాక్‌ను అందంగా ర్యాప్ చేయడానికి ప్లాస్టిక్ ర్యాపర్స్ వాడుతుంటాం. ఈ క్రమంలోనే ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఎకో ఫ్రెండ్లీ బయో షీట్ తయారుచేసింది ఢిల్లీలోని పెర్ల్ అకాడమీ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో మూడో సంవత్సరం చదువుతున్న 21 ఏళ్ల నమ్య పరిఖ్.
ప్రొడక్ట్ ఇండస్ట్రియల్ డిజైన్ కోర్సును అభ్యసిస్తున్న నమ్య ప్రాజెక్ట్‌లో భాగంగా ‘బయో లెదర్’ కనుగొనే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలోనే ఆమె ఇంటి వంటగదిలో బయోమెటీరియల్‌ని ఆవిష్కరించి ఫ్యాషన్ పరిశ్రమలో గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. ఈ మేరకు ఎండిన నిమ్మ, నారింజ తొక్కలతో పాటు అగర్ పౌడర్ ఉపయోగించి బహుముఖంగా వాడే మెటీరియల్‌ను రూపొందించింది. దీన్ని బటన్లు, డ్రై ప్యాకేజింగ్ మెటీరియల్‌గా ఉపయోగించుకోవచ్చు. తన అకాడమీకి చెందిన పూర్వ విద్యార్థితో కలిసి, తాను రూపొందించిన మెటీరియల్ ఉపయోగించి ఇయర్ రింగ్స్, నెక్లెస్‌లు, బెల్ట్‌లు తయారుచేస్తోంది.
‘మేము రిమోట్‌గా చదువుతున్నందున, వంటగదిలో ఉత్పత్తయ్యే వ్యర్థ పదార్థాలతో ఏదో ఒక ఆవిష్కరణ చేయడమే మా టార్గెట్. తొలిగా ఎగ్ షెల్స్, కూరగాయలు, అరటి తొక్కలు వంటి పదార్థాలను మొక్కజొన్న పిండి లేదా బంగాళాదుంప పిండితో కలిపి ప్రొడక్ట్ తయారుచేయాలని భావించాను. కానీ అవి ఆచరణీయమైనవి కావని, ఫైనల్ ప్రొడక్ట్ చాలా మందంగా, పెళుసుగా ఉండటంతో సౌకర్యవంతం కాదని అర్థమైంది. దాంతో నిమ్మ , నారింజ వంటి సిట్రస్ పీల్స్ ఉపయోగించి అగర్ పౌడర్, ప్లాంట్ బేస్డ్ జెలటిన్‌లను బైండింగ్ ఏజెంట్‌గా ఉపయోగించాను. మూడు వారాల ట్రయల్ అండ్ ఎర్రర్ తర్వాత సరైన ఫార్ములాతో ఓ మెటీరియల్ చేసాను. ఇది తడి రూపంలో ఉన్నప్పుడు, వివిధ ఆకృతులను తయారు చేయడానికి అచ్చులలో పోసుకునే విధంగా చాలా కంఫర్ట్‌గా ఉంది. బయో షీట్లను తయారు చేసే ప్రక్రియలో ఈ మిశ్రమాన్ని పలుచని షీట్ లాగా గాలిలో ఆరబెట్టాలి. వీటిని బహుమతులు ర్యాప్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. గిఫ్ట్ ప్యాకింగ్ కోసం సెల్లోటేప్ లేదా జిగురును ఉపయోగించాల్సిన అవసరం లేదు. బయో షీట్ మీద కొద్దిగా నీరు బ్రష్ చేస్తే సరిపోతోంది. వాటి చివర్లను ఈజీగా స్టిక్ చేయొచ్చు. ఫార్ములాను కొద్దిగా మార్చి దృఢంగా మెటీరియల్ రూపొందించాను దాంతో చిన్న బటన్‌లు తయారుచేసుకోవచ్చు.
ఈ మెటీరియల్ పూర్తిగా బయోడీగ్రెడబుల్. మట్టిలో పాతేస్తే ప్యాకేజింగ్ పూర్తిగా కరిగిపోతోంది. నిమ్మ, నారింజ తొక్కలను ఉపయోగించి దీన్ని తయారు చేసినందున, నేల సారవంతం మెరుగుపరచడానికి ఇది ఉపయోగకరం.
– నమ్య పరిఖ్