- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదుగురి ప్రాణాలు కాపాడిన 20నెలల చిన్నారి
దిశ, వెబ్‌డెస్క్ : 20నెలల వయస్సున్న చిన్నారి ఐదుగురి ప్రాణాలను కాపాడింది. అంత చిన్న పాప ఎలా కాపాడుతుందని అని అందరికీ అనుమానం రావొచ్చు. కానీ, అదే నిజం. అతి చిన్న వయస్సులోనే అవయవదానం చేసి మరో ఐదుగురికి ప్రాణ దానం చేయడమే కాకుండా, దేశంలోనే అతి చిన్న వయస్సు గల ఆర్గాన్ డోనర్‌గా రికార్డు నెలకొల్పింది.
వివరాల్లోకివెళితే.. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ధనిష్ట(20నెలలు) ఫ్యామిలీ నివాసముంటోంది. జనవరి 11న చిన్నారి ఇంటి బాల్కనీలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పై నుంచి కింద పడిపోయింది. గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు వెల్లడించారు. అయితే, ఆ చిన్నారి ఆర్గాన్స్ దానం చేయాలని వైద్యుల సూచించడంతో తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో ధనిష్ట గుండె, లివర్, కిడ్నీలు, కళ్లను విజయవంతంగా ఆపరేషన్ చేసి ఐదుగురికి అమర్చినట్లు సర్ గంగారామ్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు.