ICC World Cup 2023: రీఎంట్రీలో సత్తా చాటిన కేన్‌ మామ..

by Vinod kumar |   ( Updated:2023-10-03 12:43:31.0  )
ICC World Cup 2023: రీఎంట్రీలో సత్తా చాటిన కేన్‌ మామ..
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ రీఎంట్రీలో సత్తా చాటాడు. వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో దిగిన కేన్‌ మామ అదిరిపోయే అర్ధసెంచరీతో ఇరగదీశాడు. ఈ మ్యాచ్‌లో 50 బంతులు ఎదుర్కొన్న అతను 8 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేసి రిటైర్డ్‌ అయ్యాడు. దీంతో పాక్‌ నిర్ధేశించిన 346 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే దిశగా న్యూజిలాండ్‌ ముందుకు సాగుతుంది.

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగిన రచిన్‌ రవీంద్ర సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. రచిన్‌ 66 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌ సాయంతో 88 పరుగులు చేసి సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ రెండో ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయినప్పటికీ (కాన్వే (0)) ఏమాత్రం తడబడకుండా లక్ష్యం దిశగా దూసుకెళ్తుంది. 21 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 159/1గా ఉంది. రచిన్‌కు జతగా డారిల్‌ మిచెల్‌ (9) క్రీజ్‌లో ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed