- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ICC World cup-2023 : రోహిత్ ఫామ్‌లోకి వస్తే.. ఆపడం అసాధ్యం : మార్నస్ లబూషేన్
దిశ, వెబ్ డెస్క్ : వన్డే వరల్డ్ కప్ -2023లో భాగంగా అక్టోబర్ 8న, చెన్నై వేదికగా భారత్, ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. ఈ క్రమంలో భారత్ గాయపడిన ఆఫ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేసింది. అదేవిధంగా ఆస్ట్రేలియా జట్టులో గాయపడిన అష్టన్ అగర్ స్థానంలో మార్నస్ లాబూషేన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. అయితే, ఈ నేపథ్యంలో మార్నస్ లబూషేన్ భారత కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశంసిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ బ్యాటింగ్ చేసే సమయంలో ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా వేగంగా పరుగులు చేయగలడని అన్నాడు. ఒక్కసారి చెలరేగితే.. అతడిని ఆపడం చాలా కష్టమని అన్నాడు. ఇటీవల తమతో జరిగిన వన్డే సిరీస్ మంచి స్కోర్లు సాధించాడని గుర్తు చేశాడు. ఇది రాబోయే వరల్డ్ కప్‌లో భారత జట్టుకు శుభ పరిణామమని అన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తమ దేశానికి వచ్చిన రోహిత్‌ను దగ్గరగా చూస్తూ.. తన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని లబూషేన్ అన్నాడు.
Read More : World cup-2023 : నాలుగో స్థానానికి అతడే కరెక్ట్.. వీరేంద్ర సేహ్వాగ్