- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: వరల్డ్ కప్-2023 సెమీస్ బెర్తులు ఖరారు.. ఆ నాలుగు జట్లు ఏవంటే..?
దిశ, వెబ్‌డెస్క్: భారత్ వేదికగా జరుగుతోన్న వన్డే వరల్డ్ కప్-2023లో సెమీస్ బెర్తులు ఖరారు అయ్యాయి. భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్ నాలుగవ ప్లేస్‌లో ఉన్న న్యూజిలాండ్‌తో తలపడనుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీస్ మ్యాచ్ ఈ నెల 15వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా టీమ్‌లు రెండవ సెమీస్ మ్యాచ్‌లో తలపడనున్నాయి.
ఈ మ్యాచ్ నవంబర్ 16వ తేదీన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా జరగనుంది. సెమీస్ బెర్తులు ఖరారు కావడంతో ఈ మ్యాచ్‌ల కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు ఈ వరల్డ్ కప్‌లో దారుణంగా విఫలమయ్యాయి. చిన్న చిన్న జట్లపైన ఓటమి పాలై గ్రూప్ స్టేజ్‌లోని ప్రపంచ కప్ రేసు నుండి వైదొలిగాయి.
సొంతదేశంలో జరుగుతోన్న వరల్డ్ కప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఊహించని రీతిలో లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. గ్రూప్ స్టేజ్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇండియా సెమీస్‌కు చేరుకోవడం గమనార్హం. ఇక, వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచుల్లో భాగంగా ఇండియా తన చివరి మ్యాచ్ పసికూన నెదర్లాండ్స్‌తో తలపడనుంది.