ICC World Cup-2023 : పాకిస్థాన్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

by Shiva |   ( Updated:2023-10-16 05:11:04.0  )
ICC World Cup-2023 : పాకిస్థాన్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఐసీసీ వరల్డ్ కప్-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దాయాది పాకిస్థాన్ అనుకున్న స్థాయిలో రాణించలేదు. భారత బౌలర్ల ముప్పేట దాడికి పాక్ మిడిలార్డర్ కకావికలమైంది. 42.5 ఓవర్లకు 191 పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (50) పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌‌గా నిలిచాడు. అదేవిధంగా మహమ్మద్ రిజ్వాన్ (49) ఇమామ్-ఉల్-హాక్ (36), అబ్దుల్లా షఫీక్ (20) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో జస్ర్పీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగనుంది.

Advertisement

Next Story