పాకిస్థాన్ సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే ఇలా జరగాలి

by Mahesh |   ( Updated:2023-10-28 10:45:21.0  )
పాకిస్థాన్ సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే ఇలా జరగాలి
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్ 2023లో పాకిస్థాన్ జట్టు పేలవమైన ఆటను కనబరుస్తుంది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో పాక్ ఓడిపోయి సెమీఫైనల్ చేరుకునే మార్గాన్ని క్లిష్టతరం చేసుకుంది. ముఖ్యంగా వరుసగా మూడు మ్యాచుల్లో హాట్రిక్ ఓటమిలను చవిచూసి.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. అయితే ఇంకా పాకిస్తాన్ జట్టుకు సెమీస్ చేరుకునే అవకాశం ఉంది. అది ఎలాగంటే.. పాక్ తన తదుపరి అన్ని మ్యాచుల్లో మంచి రన్ రేటుతో గెలవాలి.. అలాగే.. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తమకు మిగిలి ఉన్న నాలుగు మ్యాచుల్లో కనీసం మూడింట్లో ఓడిపోవాల్సి ఉంది. అలా జరిగితే పాక్ నాలుగో స్థానంలో సెమీస్ చేరుకునే అవకాశం ఉంది. 1992లో కూడా పాక్ ఇలాంటి మిరాకిల్ జరిగే సెమీస్ కు క్వాలిఫై అయింది.

Advertisement

Next Story