49 సెంచరీల రికార్డ్ బ్రేక్.. విరాట్‌ కోహ్లీపై సచిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Satheesh |   ( Updated:2023-11-15 15:04:13.0  )
49 సెంచరీల రికార్డ్ బ్రేక్.. విరాట్‌ కోహ్లీపై సచిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. ఇవాళ న్యూజిలాండ్‌పై సెంచరీతో చెలరేగిన కోహ్లీ.. వన్డే ఫార్మాట్లో (50) సెంచరీలు చేసిన తొలి ప్లేయర్ చరిత్ర సృష్టించాడు. తద్వారా సచిన్ (49) సెంచరీల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్ హిస్టరీలో 50 సెంచరీల మైలు రాయి అందుకున్న ఏకైక ప్లేయర్‌గా విరాట్ నిలిచాడు. వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసుకుని.. సచిన్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో తన రికార్డ్‌ను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించారు. యువకుడు ‘విరాట్’గా ఎదిగినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో నా రికార్డ్ బద్దలుకొట్టడం గ్రేట్ అని కొనియాడారు. నా రికార్డ్‌ను భారతీయుడు బద్దలుకొట్టడం ఆనందంగా ఉందన్నారు.

Read More..

'ఢిల్లీ చీఫ్ సెక్రెటరీని పదవి నుంచి తప్పించండి'.. లెఫ్టినెంట్ గవర్నర్‌‌కు సీఎం కేజ్రీవాల్ నివేదిక

Advertisement

Next Story