David Warner: వారెవ్వా వార్నర్‌.. మరోసారి మనసులు గెలిచిన డేవిడ్‌ భాయ్‌

by Vinod kumar |   ( Updated:2023-10-18 04:59:57.0  )
David Warner: వారెవ్వా వార్నర్‌.. మరోసారి మనసులు గెలిచిన డేవిడ్‌ భాయ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి అభిమానుల మనసులు దోచుకున్నాడు. ICC World Cup 2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో లంక తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఈ సమయంలో తక్షణమే స్పందించిన మైదాన సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పే ప్రయత్నం చేయగా.. ఆ సమయంలో మైదానం వీడుతున్న వార్నర్‌ గ్రౌండ్‌ సిబ్బందితో కలిసి కవర్స్‌ లాగేందుకు సహకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా.. ఆట పట్ల అతడికున్న నిబద్దతకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed