- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ICC World Cup 2023: హాఫ్ సెంచరీలతో చెలరేగిన యంగ్, రచిన్, లాథమ్.. కివీస్ భారీ స్కోరు
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచక్‌ప్-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్‌లకు 7 వికెట్లు కోల్పోయి 322 రన్స్ చేసింది. యంగ్, రచిన్, లాథమ్.. హాఫ్ సెంచరీలతో చెలరేగగా న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్స్‌లో కాన్వే 32, యంగ్ 70 (7 ఫోర్లు, 2 సిక్సర్‌లు), రచిన్ 51 (3 ఫోర్లు, 1 సిక్సర్), మిచెల్ 48, లాథమ్ 53 పరుగులతో రాణించగా భారీ స్కోరు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్‌లో.. మీకెరెన్, మెర్వే, ఆర్యన్ తలో 2 వికెట్లు తీయగా. ఆల్‌రౌండర్ బాస్ డి లిడేకు ఒక వికెట్ దక్కింది.
మూడు హాఫ్ సెంచరీలు..
ఈ క్రమంలో మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు డెవాన్ కాన్వే(32), విల్ యంగ్ శుభారంభం అందించారు. గత మ్యాచ్ సెంచరీ హీరో, వన్‌డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఈసారి 51 పరుగులతో రాణించగా.. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన డారిల్ మిచెల్ 48, కెప్టెన్ టామ్ లాథమ్ 53 పరుగులతో అదరగొట్టారు.
సాంట్నర్ మెరపులు..
అయితే ఈ మ్యాచ్లో గ్లెన్ ఫిలిప్స్(4) పూర్తిగా నిరాశపరచగా.. మార్క్ చాప్‌మన్ 5 పరుగులు మాత్రమే చేశాడు. ఎనిమిదో స్థానంలో వచ్చిన మిచెల్ సాంట్నర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 3 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 36 పరుగులతో అజేయంగా నిలిచాడు.