INDvsPAK: కాసేపట్లో హై ఓల్టేజీ మ్యాచ్.. అభిమానులకు సూపర్ న్యూస్

by GSrikanth |
INDvsPAK: కాసేపట్లో హై ఓల్టేజీ మ్యాచ్.. అభిమానులకు సూపర్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. గత దశాబ్ద కాలంగా భారత గడ్డపై ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్ వన్డే మ్యాచ్‌లు ఆడలేదు. దీనికి తోడు ప్రస్తుత వరల్డ్‌ కప్‌లో ఇరు జట్లు చాలా బలంగా ఉన్నాయి. రెండు జట్లు రెండేసి విజయాలు సాధించి హ్యాట్రిక్‌ విజయంపై కన్నేశాయి. కాబట్టి అందరి దృష్టి శనివారం జరిగే మ్యాచ్‌పైనే ఉంటుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పుపై టెన్షన్ నెలకొంది. అహ్మదాబాద్‌లో వర్షం కురిసే అవకాశాలు దాదాపు తక్కువగానే ఉన్నాయి. అహ్మదాబాద్‌లోని వెదర్ నివేదిక ప్రకారం.. 14 శాతం మేఘావృతమై ఉన్నా వర్షం పడే అవకాశం లేదు.

భారత్-పాకిస్థాన్ మధ్య మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు టాస్ జరుగుతుంది. దీనికి గంట ముందు 12.30 గంటలకు ఓపెనింగ్‌ సెర్మనీ నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించనున్నారు. అహ్మదాబాద్‌లో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమయ్యే సమయంలో ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గుతుంది. అయితే తేమ బాగా కురుస్తుంది. ఆ తర్వాత వాతావరణం చల్లగా ఉంటుంది. వాతావరణం మేఘావృతమైనప్పటికీ వర్షం కురిసే అవకాశం లేదు.

Advertisement

Next Story