- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ICC World Cup 2023 Warm Up Match: సెంచరీతో చెలరేగిన రిజ్వాన్.. న్యూజిలాండ్ టార్గెట్ ఇదే
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న వరల్డ్‌కప్ వార్మప్ గేమ్‌లో పాక్ భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (94 బంతుల్లో 103 రిటైర్డ్ ఔట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (84 బంతుల్లో 80; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అదిరిపోయే అర్ధసెంచరీతో రాణించాడు.
ఆఖర్లో సౌద్ షకీల్ (53 బంతుల్లో 75; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), అఘా సల్మాన్ (23 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), షాదాబ్ ఖాన్ (11 బంతుల్లో 16; 2 సిక్సర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (3 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) బ్యాట్ ఝులిపించడంతో పాక్ భారీ స్కోర్ చేసింది. ఆఖరి ఓవర్లో ఫెర్గూసన్ పొదుపుగా బౌల్ చేయడంతో పాక్ 345 పరుగులతో సరిపెట్టుకుంది. కివీస్ బౌలర్లలో.. మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్ తలో వికెట్ పడగొట్టారు.
Batters warm up in style 🔥
— Pakistan Cricket (@TheRealPCB) September 29, 2023
A glorious century by @iMRizwanPak and brilliant fifties by @babarazam258 and @saudshak take Pakistan to 345-5 💪#NZvPAK | #CWC23 | #WeHaveWeWill pic.twitter.com/JWSl9FfAHG