ICC World Cup 2023: వార్మప్ మ్యాచ్‌లో పాక్‌పై ఆసీస్ విజయం..

by Vinod kumar |
ICC World Cup 2023: వార్మప్ మ్యాచ్‌లో పాక్‌పై ఆసీస్ విజయం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప్పల్ స్టేడియంలో వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 14 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. హైదరాబాద్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిన పాక్‌. ఆసీస్ ఇచ్చిన 351 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పాక్ 47.4 ఓవర్‌లో 337 రన్స్ చేసి.. అలౌట్ అయింది. పాక్ బ్యాటర్‌లో.. బాబర్ ఆజం (90), ఇఫ్తికార్ అహ్మద్ (83), మహ్మద్ నవాజ్ (50) రాణించగా.. మిగిలిన బ్యాటర్స్ విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్‌లో.. మార్నస్ లాబుస్చాగ్నే (3), మిచెల్ మార్ష్ (2), పాట్ కమిన్స్ (2) వికెట్లు తీయగా.. గ్లెన్ మాక్స్‌వెల్, సీన్ అబాట్ చెరో వికెట్ తీశారు.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 351 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్‌లో.. డేవిడ్‌ వార్నర్‌ (33 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మిచెల్‌ మార్ష్‌ (48 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), లబూషేన్‌ (31 బంతుల్లో 40; 5 ఫోర్లు) రాణించగా.. ఆఖర్లో మ్యాక్స్‌వెల్‌ (71 బంతుల్లో 77; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), కెమరూన్‌ గ్రీన్‌ (40 బంతుల్లో 50 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌), జోష్‌ ఇంగ్లిస్‌ (30 బంతుల్లో 48; 8 ఫోర్లు, సిక్స్‌) చెలరేగగా ఆసీస్‌ భారీ స్కోర్‌ చేసింది. పాక్ బౌలర్‌లో.. ఉసామా మిర్‌ (2) వికెట్లు తీయగా.. మొహమ్మద్‌ వసీం జూనియర్‌ (1), షాదాబ్‌ ఖాన్‌ (1), మొహమ్మద్‌ నవాజ్‌ (1) వికెట్ పడగొట్టారు.

Advertisement

Next Story

Most Viewed