- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP:‘ఇది చంద్రబాబు మార్క్ పాలన’.. కూటమి పాలన పై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu)పై వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం పై మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్(AP Govt) జీతాలు కూడా చెల్లించడం లేదని ఆయన విమర్శించారు. రూ. 400 కోట్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం జీవో విడుదల(Release of Govt) చేసిందని తెలిపారు. ఈ విషయం పై టీవీల్లో రోజంతా బ్రేకింగ్ న్యూస్ వచ్చింది.. కానీ జీవో విడుదలైన నిధులు మాత్రం హుళక్కి అయ్యాయని ఎంపీ విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు.
సీఎం చంద్రబాబు కుతంత్రాలు అలా ఉంటాయని దుయ్యబట్టారు. సమగ్ర శిక్షణలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు(contract employees) 2 నెలలుగా జీతాలు లేవని అన్నారు. ప్రాణాలను రక్షించే 108, 104 లో పని చేసే 6,500 మందికి జులై నుంచి నయా పైసా విదల్చలేదని మండిపడ్డారు. వీరే కాదు అనేక డిపార్ట్మెంట్‌లో(Departments) వేల మంది చిరుద్యోగుల జీవితాల్లో దసరా, దీపావళి పండుగలు(Diwali Festival) వస్తున్నా చిమ్మ చీకట్లు తొలగిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 'ఇది చంద్రబాబు మార్కు పాలన.. దీన్ని మార్పు అనాలంట' అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు.