CWC Qualifier 2023: చరిత్ర సృష్టించిన శ్రీలంక స్పిన్నర్‌.. ఐర్లాండ్‌‌పై భారీ తేడాతో విజయం

by Vinod kumar |
CWC Qualifier 2023: చరిత్ర సృష్టించిన శ్రీలంక స్పిన్నర్‌.. ఐర్లాండ్‌‌పై భారీ తేడాతో విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: CWC Qualifier 2023లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్‌ వనిందు హసరంగ చరిత్ర సృష్టించాడు. వరుసగా మూడు వన్డేల్లో 5 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో పాకిస్తాన్‌ స్పీడ్‌స్టర్‌ వకార్‌ యూనిస్‌ మాత్రమే వన్డేల్లో హ్యాట్రిక్‌ ఫైఫర్స్‌ సాధించాడు. ఈ టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టిన హసరంగ.. ఆ తర్వాత ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు, తాజాగా ఐర్లాండ్‌పై మరోసారి 5 వికెట్ల ఘనత సాధించాడు. హసరంగ చెలరేగడంతో ఐర్లాండ్‌పై శ్రీలంక 133 పరుగుల భారీ తేడాతో గెలుపొంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 49.5 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్స్‌లో.. కరుణరత్నే (103) సెంచరీతో చెలరేగగా.. సదీర సమరవీర (82) హాఫ్ సెంచరీతో రాణించాడు. చరిత్‌ అసలంక (38), ధనంజయ డిసిల్వ (42 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఐర్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ అదైర్‌ 4, బ్యారీ మెక్‌కార్తీ 3, గెరత్‌ డెలానీ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌.. 31 ఓవర్లలో 192 పరుగులకు కుప్పకూలింది. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో కర్టిస్‌ క్యాంపర్‌ (39) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. శ్రీలంక బౌలర్‌లో.. హసరంగ (5) వికెట్లు తీయగా.. మహీష్‌ తీక్షణ (2), కసున్‌ రజిత, లహీరు కుమార, దసున్‌ షనక చెరో ఓ వికెట్ తీశారు.

Advertisement

Next Story

Most Viewed