ఎంజీ మోటార్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ జెడ్ఎస్ కొత్త వెర్షన్

by Harish |
ఎంజీ మోటార్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ జెడ్ఎస్ కొత్త వెర్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా తన మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ జెడ్ఎస్ ఈవీని విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ధరను రూ. 20.99 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ సరికొత్త మోడల్‌లో 44.5 కిలోవాట్ల హైటెక్ బ్యాటరీ ఉందని, ఇది ఒకసారి ఛార్జింగ్‌తో 419 కిలోమీటర్ల ప్రయాణించవచ్చని తెలిపింది. సాధారణ ఏసీ ఛార్జర్‌ను ఉపయోగించి 6 నుంచి 8 గంటల్లో 100 శాతం బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అత్యాధునిక ఫీచర్లు ఉన్న కారులో 17 అంగుళాల టైర్లు, హై-గ్రౌండ్ క్లియరెన్స్, ఎకో-ట్రీ ఛాలెంజ్ ఫీచర్లను కలిగి ఉంది.

పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును గతేడాది లాంచ్ చేసిన తర్వాత అప్‌డేట్ చేసిన మొదటి మోడల్ అని కంపెనీ తెలిపింది. కొత్త జెడ్ఎస్ ఈవీ-2021లో బ్యాటరీ-ప్యాక్ గ్రౌండ్ క్లియరెన్స్‌ను పెంచినట్టు, ఇది 8.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ పేర్కొంది. ఎంజీ మోటార్స్ ఇండియా పలు భాగస్వామ్య కంపెనీలతో కలిసి దేశవ్యాప్తంగా ఛార్జింగ్ పాయింట్లను విస్తరించిందని, ప్రస్తుతం ఈ కొత్త మోడల్ కారును దేశవ్యాప్తంగా 31 నగరాల్లో బుక్ చేసుకునే వెసులుబాటును కలిగి ఉన్నట్టు తెలిపింది. ‘ఏడాది కాలంలో జెడ్ఎస్ కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చాము. వినియోగదారుల సౌకర్యం అందిస్తూనే, దేశీయంగా పటిష్ఠమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నామని’ ఎంజీ మోటార్ ఇండియా సీఎండీ రాజీవ్ చాబా వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed