- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగానికి కరోనా టైమ్‌లో పాసైన బ్యాచ్ అనర్హులు.. జాబ్ నోటిఫికేషన్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా విద్యార్థులు పరీక్షలు రాయలేని దుస్థితి ఏర్పడింది. గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని నిబంధనలతో ప్రభుత్వాలు విద్యార్థులను పాస్ చేశాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా.. 2020-21 ఏడాదిలో పాస్ అయిన విద్యార్ధుల పట్ల ఓ బ్యాంక్ జాబ్ సర్క్యులర్ వివాదాస్పదంగా మారింది. హెచ్‌డీఎఫ్‌సీకి సంబంధించిన ఓ జాబ్ సర్క్యులర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ జాబ్ సర్కులర్‌లో ఉన్న కండీషన్ చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కరోనా కాలంలో పాసైన అభ్యర్థులు ఉద్యోగానికి అనర్హులంటూ అందులో పేర్కొన్నారు. అంటే 2021లో ఎగ్జామ్స్ రాయకుండా పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అనర్హులు అని అర్థం. డిగ్రీ క్వాలిఫికేషన్‌తో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది హెచ్‌డీఎఫ్‌సీ. అందులో.. 2021 పాస్ అవుట్ బ్యాచ్ నాట్ ఎల్జిబుల్ అని స్పష్టంగా ఉంది. ఈ కండీషన్ కారణంగా జాబ్ సర్కులర్ ఒక్కసారిగా వైరల్‌గా మారింది. దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చి.. వివాదానికి దారి తీయడంతో HDFC బ్యాంకు యాజమాన్యం స్పందించింది.
అది అక్షర దోషం అని వివరణ ఇచ్చింది. సర్క్యులర్‌లో తప్పు వచ్చినందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. తర్వాత డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు అని, పాస్ అయిన సంవత్సరంతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. కరెక్షన్ చేసిన సర్క్యులర్‌ను మళ్లీ షేర్ చేసినట్టు హెచ్‌డీఎఫ్‌సీ కేరీర్ విభాగం ట్విట్టర్‌లో తెలిపింది.
This is atrocitious! @HDFC_Bank pic.twitter.com/2erLBtuG9Z
— Tr Gayathri Srikanth (@Tr_Gayathri) August 2, 2021
Happy on behalf of the young graduates 🙏🏽😍 @HDFCBank_Cares @HDFC_Bank https://t.co/rHSVMByrTi
— Tr Gayathri Srikanth (@Tr_Gayathri) August 5, 2021