భారత మార్కెట్లోకి బీఎండబ్ల్యూ నుంచి లగ్జరీ బైక్

by Harish |
భారత మార్కెట్లోకి బీఎండబ్ల్యూ నుంచి లగ్జరీ బైక్
X

దిశ, వెబ్‌డెస్క్: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ తన ద్విచక్ర వాహన తయారీ విభాగం బీఎండబ్ల్యూ మోటరాడ్ లగ్జరీ మోటార్ బైక్‌ను గురువారం భారత మార్కెట్లో విడుదల చేసింది. సరికొత్త అడ్వెంచర్ స్పోర్ట్స్ బైక్ వెర్షన్‌గా ‘బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఎక్స్ఆర్’ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ బైక్ ధర రూ. 20.9 లక్షలని వెల్లడించింది. బిల్డ్ అప్ యూనిట్(ఈబీయూ)గా ఈ బైక్‌ను గురువారం నుంచే ఆర్డర్ చేసుకునే వీలు కల్పించామని కంపెనీ ప్రకటించింది. 100 కిలోమీటర్ల వేగాన్ని 3.3 సెకన్ల గరిష్ట వేగాన్ని అందుకునే ఈ బైక్ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని కంపెనీ వెల్లడించింది. కొత్త 999 సీసీ 4 సిలిండర్ ఇన్-లైన్ ఇంజన్‌తో నడుస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే, ఈ బైక్ 11,000 ఆర్ఎంపీతో 165 హెచ్‌పీని ఉత్పత్తి చేస్తుంది. ఇక, ఇంతకుముందున్న బైక్‌ కంటే రైడింగ్ డైనమిక్స్‌ను పెంచేలా అనువైన డిజైన్ చేశామని, నూతనంగా అభివృద్ధి చేసిన ఇంజిన్ రాజీలేని ఎర్గోనామిక్స్‌తో మంచి పనితీరు కనబరుస్తుందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా తాత్కాలిక అధ్యక్షుడు అర్లిండో టిక్సీరా చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed