ఇండియా పర్యటనను అధికారికంగా ప్రకటించిన ఆస్ట్రేలియా

by vinod kumar |
ఇండియా పర్యటనను అధికారికంగా ప్రకటించిన ఆస్ట్రేలియా
X

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ ఆస్ట్రేలియా రాబోయే సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను గురువారం అధికారికంగా ప్రకటించింది. కరోనా ప్రభావం అగస్టులోపు తగ్గుతుందని అంచనా వేసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా పురుషుల, మహిళల క్రికెట్ జట్ల మ్యాచ్‌లను ప్రకటించింది. 2020-21 వేసవి సీజన్‌ను జింబ్వాబ్వే జట్టుతో ప్రారంభిస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవిన్ రాబర్ట్స్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో తమ దేశంలో కూడా లాక్‌డౌన్ ప్రకటించారని.. అయితే తమ దేశంలో పర్యటించే ఆతిథ్య జట్టు సభ్యులకు పూర్తి రక్షణ కల్పించనున్నట్టు సీఏ తెలిపింది. తమ దేశంలో పర్యటించడానికి ఒప్పుకున్న అన్ని క్రికెట్ బోర్డులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలో స్టేడియంలలో బయో సెక్యూర్ నిబంధలను పాటిస్తామని.. దీనిపై ఇప్పటికే ప్రణాళిక రచించినట్టు ఆయన స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి తర్వాత లైవ్ క్రికెట్‌ను అందించడానకి సిద్ధంగా ఉన్నామని.. ఇండియా, ఆసీస్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లు తమకు కీలకమని ఫాక్స్ స్పోర్ట్స్ హెడ్ పీటర్ క్యాంప్‌బెల్ చెప్పారు.

ఇండియా పర్యటన :

జిల్లెట్ మెన్స్ టీ20 సిరీస్

1. గబ్బా స్టేడియం, బ్రిస్బేన్, అక్టోబర్ 11
2. ఓవల్ స్టేడియం, కాన్‌బెర్రా, అక్టోబర్ 14
3. అడిలైడ్ ఓవల్, అడిలైడ్, అక్టోబర్ 17

టెస్ట్ సిరీస్

1. ది గబ్బా, బ్రిస్బేన్ (అక్టోబర్ 3-7)
2. అడిలైడ్ ఓవల్, అడిలైడ్ (డిసెంబర్ 11-15)
3. ది ఎంసీజీ, మెల్‌బోర్న్ (డిసెంబర్ 26-30) బాక్సింగ్ డే టెస్టు
4. ది ఎస్‌సీజీ, సిడ్నీ ( జనవరి 3 – 7) పింక్ బాల్ టెస్ట్

జిల్లెట్ మెన్స్ వన్డే సిరీస్

1. పెర్త్ స్టేడియం, పెర్త్ ( జనవరి 12)
2. ది ఎంసీజీ, మెల్‌బోర్న్ (జనవరి 15)
3. ది ఎస్‌సీజీ, సిడ్నీ (జనవరి 17)

భారత మహిళా జట్టు పర్యటన

కామ్‌బ్యాంక్ మహిళా వన్డే సిరీస్

1. మనుకా ఓవల్, కాన్‌బెర్రా (జనవరి 22)
2. జంక్షన్ ఓవల్, సెయింట్ కిల్దా ( జనవరి 25)
3. బ్లండ్‌స్టోన్ అరీనా, హోబార్ట్ (జనవరి 28)

దీంతో పాటు అగస్టులో జింబాబ్వే జట్టు మూడు వన్డేల పర్యటనకు, అక్టోబర్‌లో వెస్టిండీస్ జట్టుతో మూడు టీ20లు, నవంబర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో ఏకైక టెస్టు, జనవరి-ఫిబ్రవరిలో న్యూజిలాండ్ జట్టుతో నాలుగు వన్డేలు, ఒక టీ20 ఆడనుంది. మరోవైపు న్యూజీలాండ్ మహిళా జట్టు కూడా పర్యటించనుంది.

Advertisement

Next Story