మహిళా న్యాయవాదులను ఆదుకోండి..

by Shamantha N |
మహిళా న్యాయవాదులను ఆదుకోండి..
X

దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మహిళా న్యాయవాదులను ఆదుకోవడానికి ముందుకు రావాలని, కోర్టుల్లో వర్చువల్‌ సదుపాయాలు మెరుగుపరచాలని దేశవ్యాప్తంగా ఉన్న 2వేల మంది మహిళా న్యాయవాదులు కేంద్రమంత్రి అమిత్‌షాను కోరారు. ఈ మేరకు శుక్రవారం కేంద్రహోంమంత్రికి రాసిన వినతిపత్రంలో కోరారు. విపత్తు నిర్వహణ చట్టం కింద న్యాయవాదులకు ఆర్థికసహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి, న్యాయశాఖ మంత్రికి, ఆర్థిక మంత్రికి కూడా పంపారు. మహిళా న్యాయవాదులు జూలై 21న ప్రాతినిధ్యం కోసం సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించారు.

ఇందులో 40 గంటల వ్యవధిలో రెండు వేల మంది న్యాయవాదుల నుంచి ప్రతి స్పందనలను తీసుకున్నారు. సీనియర్ న్యాయవాది మీరా ఖడక్కర్, అర్చనా పాఠక్ దవే సైతం సంతకాలు చేసిన వారిలో ఉన్నారు. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు.. యూనియన్‌ ఆఫ్‌ ఇండియా, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తదితరులను తమ స్పందనను దాఖలు చేయాలని కోరింది. ‘అన్‌లాక్‌’ ప్రస్తుత ప్రక్రియ జరుగుతున్న సమయంలో కూడా కోర్టులు నామమాత్రంగా పని చేస్తున్నాయని, ఆ రోజు ఆర్డర్‌గా మారిన వర్చువల్ కోర్టులు మాత్రమేనని మహిళా న్యాయవాదులు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ‘చాలా మంది న్యాయవాదులు సరైన మౌలిక సదుపాయాలు, ల్యాప్‌టాప్‌లు, స్కానర్‌లు, మంచి బ్యాండ్‌విస్త్‌ కోసం వైఫై ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు.

వర్చువల్ కోర్టుల్లో వర్చువల్ హియరింగ్‌లలో పాల్గొనేందుకు అసోసియేషన్‌లో ప్రత్యేకమైన స్థలాలు కూడా లేవని’ వినతిపత్రంలో పేర్కొన్నారు. ‘వినతిని మంత్రిత్వశాఖ పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుత జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు అడ్వకేట్‌ కమ్యూనిటీకి ఎంతో సహాయకారిగా ఉంటుందని, వర్చువల్‌ కోర్టుల పనితీరును మెరుగుపరుస్తుంది’ అని తెలిపారు. ఈ ఏడాది మార్చి నుంచి కోర్టుల పరిమిత పనితీరు కారణంగా లాయర్ల సంఘం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడికి మహిళా న్యాయవాదులు తీవ్రంగా విచారం వ్యక్తం చేశారని తెలిపింది.

Advertisement

Next Story