- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాగర్ కాలువలో 100 మందితో 20కి.మీ ఈత ర్యాలీ
దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం జిల్లాలోని సాగర్ ఎడమ కాల్వలో ఆదివారం ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సుమారు 100 మంది 20 కిలోమీటర్ల దూరం ఈతకొట్టి అందరిని ఆశ్చర్య పరిచారు. ఈ పోటీలో మూడేళ్ల చిన్నారితోపాటు 75 ఏళ్ల వృద్ధుడు కూడా పాల్గొనడం గమనార్హం.
ఖమ్మం రూరల్ మండలం తెల్లారుపల్లి నుంచి ఖమ్మం రమణగుట్ట వరకు ఈ పోటీ కొనసాగింది. ఈ పోటీలల్లో జాతీయ జెండాను ప్రదర్శించి దేశభక్తిని చాటుకున్నారు. ఖానాపురం హహేలి ఈత అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ బాధ్యులు కోదాటి గిరి తెలిపారు. అనేక మంది ఉత్సహకులకు ఉచితంగా ఈత నేర్పుతున్నామని పేర్కొన్నారు. ఈతను గుర్తించాలనే ఉద్ధేశ్యంతోనే 20కి.మీ టార్గెట్ ఎంచుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో తమ్మినేని వెంకట్రావ్, జంగాల రవి, సునీల్, గోగుల వీరయ్య, బిల్లగిరి వెంకటేశ్వరరావు, సుందరిలాల్, పాపారావు, వీరస్వామి, చందర్రావు, అమర్, శేఖర్ ఉన్నారు.