- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జతను కొల్పోయి.. జట్టు కోరుకుంటున్న పెంగ్విన్లు
దిశ, వెబ్‌డెస్క్ : ఓ ఫొటో.. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను పలికిస్తుంది. ఎన్నో జ్ఞాపకాలను మోసుకొస్తుంది. ఫొటోలు అందరూ తీస్తారు. కానీ, ఆ ఫొటో నేపథ్యం, అందులోని జీవం అందరికీ అర్థమయ్యేలా ఫొటో తీయడం ఓ కళ. ఇందుకు సమయం కూడా పడుతుంది. ‘వైల్డ్‌లైఫ్’ ఫొటోగ్రాఫర్లు కొన్ని ఫొటోల కోసం గంటలు కాదు, రోజులు, నెలల తరబడి ఓపికతో ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే జర్మన్‌కు చెందిన టోబియాస్ బామ్‌గార్ట్నర్ అనే ఫొటోగ్రాఫర్ క్యాప్చర్ చేసిన ‘విడో పెంగ్విన్ల’ ఫొటో.. ఓషియన్ ఫొటోగ్రాఫ్ అవార్డుకు ఎంపికైంది.
‘ప్రేమ’ ఒక్కసారి పుడుతుందని ఎంతమంది వాదించినా, ప్రేమ మళ్లీ మళ్లీ పురుడు పోసుకుంటుందన్నది కాదనలేని వాస్తవం. అది మనుషుల విషయంలోనే కాదు, జంతువుల్లోనూ నిజమవుతుందని ‘విడో పెంగ్విన్’ ఫొటోనే నిదర్శనం. ఈ ఫొటోలో ఉన్న పెంగ్విన్లను విడోలుగా పేర్కొంటున్నాడు. ఎందుకంటే.. అందులో కనిపించే రెండు పెంగ్విన్లు కూడా తమ తమ పార్టనర్స్‌ను కోల్పోగా, కొద్ది రోజులుగా ఒంటరిగా జీవించాయి. మనుషులకైనా, జంతువులకైనా తోడు కావాల్సిందే. అలా ఆ రెండు పెంగ్విన్లు కూడా తమ ఏకాంతాన్ని మర్చిపోవడానికి, ఒకదాని తోడు ఒకటి కోరుకోవడంతో, గంటల తరబడి కలిసి ఒకేచోట గడుపుతున్నాయి.
ఈ ఫొటో గురించి తెలుసుకున్న బామ్‌గార్ట్నర్, మెల్‌బోర్న్ సముద్ర తీరంలో సాంత్వన పొందుతున్న ఆ విడో పెంగ్విన్లు కలిసి ఉంటున్న ఫొటోను తీశాడు. ఈ ఫొటో తీయడం కోసం అతడు మూడు రోజులు వెయిట్ చేయగా, అతని కృషికి తగిన ఫలితం దక్కింది. ఓషియోనోగ్రాఫిక్ మ్యాగజైన్ అందించే ఓషియన్ ఫొటోగ్రాఫ్ అవార్డుకు ఈ వితంతు పెంగ్విన్ల జంట ఫొటో ఎంపిక కావడంతో, బామ్‌గార్ట్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విడో పెంగ్విన్ల స్టోరీని అందరితో పంచుకున్నాడు.