- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా రోగిని చితకబాదిన పోలీసులు.. వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మానవత్వం మరిచి ఇద్దరు పోలీసులు కరోనా రోగిని చితకబాదారు. ఈ విషయం కాస్తా పోలీస్ ఉన్నతాధికారులకు తెలియడంతో వారిని సస్పెండ్ చేశారు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో నిన్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. ఆస్పత్రికి తరలించేందుకు ఆరోగ్య సిబ్బంది అతని వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో హెల్త్ వర్కర్స్‌పై రోగి కుటుంబ సభ్యులు దాడి చేశారు. దాడి అనంతరం, హెల్త్ వర్కర్స్ పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కరోనా రోగితో పాటు అతని కుటుంబ సభ్యులను పోలీసులు చితకబాదారు. బాధితుడిని కర్రలతో, లాఠీలతో దారుణంగా కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఖండ్వా ఎస్పీ వివేక్ సింగ్ స్పందించి.. కరోనా రోగిపై దాడి చేసిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.