- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీవ్ర విషాదం: పెళ్లై రెండు రోజులు కూడా కాలేదు అంతలోనే నవవధువు..
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో ఆశలతో అత్తింటిలో అడుగు పెట్టాలనుకుంది.. భర్తతో సంతోషంగా గడపాలని ఆశపడింది. కానీ, ఆమె ఆశలన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి. కాళ్లపారాణి ఆరకముందే ఆమె మృత్యువాత పడింది. ఈ విషాద ఘటనతో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన మైలారం బాల్‌రెడ్డి కుమారుడు నవాజ్‌రెడ్డికి మోమిన్‌పేట మండల కేంద్రానికి చెందిన ప్రవళ్లికతో శుక్రవారం వివాహం జరిగింది. ఇక వధూవరులతో పాటు బంధువులందరు మోమిన్‌పేట విందుకు ఆదివారం కారులో బయల్దేరారు. విందు ముగించుకొని తిరిగి వస్తుండగా తిమ్మాపూర్ సమీపంలోని వాగు భారీ వర్షాలకు పొంగింది. ఇదేమి పట్టించుకోకుండా డ్రైవర్ కారును ముందుకు పోనివ్వడంతో ఒక్కసారిగా వాగు ఉదృతి పెరగడంతో కారు వరదలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో నవవధువు ప్రవళ్లిక తో పాటు కారులో ఉన్న పెళ్లికూతురు సోదరి, వరుడి అక్క, చెల్లి, ఎనిమిదేళ్ల బాలుడు ఇషాంత్‌రెడ్డి గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్కూ టీమ్ తో గాలింపు చర్యలు చేపట్టగా.. సోమవారం వధువు ప్రవళ్లికతో పాటు మరొకరి మృతదేహం లభ్యం అయ్యిందని, వరుడు నవాజ్‌రెడ్డి, ఆయన సోదరి శ్వేత క్షేమంగా ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.