సీఎం సహాయనిధికి రూ.2 కోట్లు

by Shyam |   ( Updated:2020-05-01 11:37:48.0  )
సీఎం సహాయనిధికి రూ.2 కోట్లు
X

దిశ, న్యూస్ బ్యూరో : కరోనా నివారణలో సాయపడేందుకు సీఎంవ సహాయ నిధికి దాతల నుంచి విరాళాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఒక్కరోజే పదిహేను మంది దాతల ద్వారా రూ.2 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్‌కు వచ్చినట్టు కేటీఆర్ కార్యాలయం తెలిపింది. నార్నే ఎస్టేట్స్ సీఈఓ గోకుల్ రూ.50 లక్షల చెక్కును మంత్రికి అందజేశారు. స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ రూ.25 లక్షలు, రాణే గ్రూప్ లిమిటెడ్ రూ.30 లక్షలు, నెక్టర్ తేరప్యూటిక్స్ రూ.15 లక్షలు, తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ తరఫున కందాల పాపిరెడ్డి రూ.11 లక్షలు, తెలంగాణ స్టేట్ బీడీ లీవ్స్ ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రూ.8 లక్షలు, ఫతే మైదాన్ క్లబ్ రూ.6 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. వీరితో పాటు సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, రక్షిత్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సైనర్ లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, స్వామి వివేకానంద సేవా సమితి రూ.5 లక్షల చొప్పున విరాళాలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు.

Tags: CM relief fund, KTR, KCR, corona, schools, pharma,

Advertisement

Next Story

Most Viewed