సికింద్రాబాద్‌కు చేరిన మొదటి రైలు

by Shyam |
సికింద్రాబాద్‌కు చేరిన మొదటి రైలు
X

దిశ, న్యూస్‌బ్యూరో
ఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌కు ఈ నెల 17న సాయంత్రం బయలుదేరిన స్పెషల్ ట్రైన్ (నెంబర్.02438) సోమవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంది. ఇందులో 528 మంది వలస కూలీలు సికింద్రాబాద్ చేరుకున్నారు.కోవిడ్-19 నివారణకు చేపట్టిన అన్ని చర్యలతో పాటు స్టేషన్లలోనూ భౌతిక దూరం పాటించేలా తగు జాగ్రతలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వచ్చిన మొదటి వీక్లీ స్పెషల్ ట్రైన్ ఇదే.

Advertisement

Next Story

Most Viewed