19 ఏళ్లకే క్రిమినల్ థాట్స్.. ఇన్‌స్టాలో మహిళకు రిక్వెస్ట్.. ఆపై ఆమెతో సెక్సువల్..!

by Sumithra |   ( Updated:2021-12-04 07:13:36.0  )
19 ఏళ్లకే క్రిమినల్ థాట్స్.. ఇన్‌స్టాలో మహిళకు రిక్వెస్ట్.. ఆపై ఆమెతో సెక్సువల్..!
X

దిశ, వెబ్‌డెస్క్ : టెక్నాలజీ విప్లవం అభివృద్ధికి ఎంతగా దోహదపడుతుందో నేరాల పెరుగుదలకు కూడా అంతే తోడ్పాటునందిస్తోంది. కొందరు టెక్నాలజీని తమ ఎదుగుదల కోసం ఉపయోగిస్తుంటే మరికొందరు మాత్రం తమ పతనానికి వినియోగిస్తున్నారు. తాత్కాలిక ఆనందాల కోసం తమ జీవితాలను అంధకారంలోకి నెట్టేసుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు సోషల్ మీడియా సాయంతో ఓ మహిళను లైంగికంగా వేధించాడు. అంతటితో ఆగకుండా బెదిరింపులకు పాల్పడ్డాడు. మహిళ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకివెళితే.. హైదరాబాద్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడు ఇన్ స్టా గ్రామ్‌లో ఫేక్ ఐడీ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ఓ మహిళకు రిక్వెస్ట్ పెట్టాడు. ఆమె దానిని యాక్సెప్ట్ చేయడంతో కొన్ని రోజులు ఆమెతో మంచిగా మెసేజ్ చేసి తన క్రిమినల్ థాట్స్‌ను బయట పెట్టాడు. ఆమెను లైంగికంగా వేధించడమే కాకుండా మాట వినకపోయే సరికి మహిళ ఫోటోలను మార్ఫింగ్ చేసి కొన్ని డేటింగ్ సైట్స్‌లో పోస్టు చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed