ఒక్క నిమిషంలో 190 గణిత సమస్యలు

by  |
ఒక్క నిమిషంలో 190 గణిత సమస్యలు
X

ప్రపంచరికార్డులున్నవి బద్దలు కొట్టడానికే అన్నట్లుగా.. ఒకరి తర్వాత ఒకరు అంకితభావంతో పనిచేసి కొత్త రికార్డులు సృష్టిస్తుంటారు. అందుకోసం వాళ్లు పడిన శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి వారికి ప్రోత్సాహం ఇవ్వడానికే ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ లాంటి సంస్థలు ఉన్నాయి. అయితే గిన్నిస్ రికార్డుల్లో గణిత సమస్యలు పరిష్కరించే రికార్డులు చాలా తక్కువ. అయితే పదేళ్ల వయస్సున్న ‘నడుబ్ గిల్’ ఒక అరుదైన రికార్డు సృష్టించాడు. గణితం అనగానే కొందరు భయపడతారు. కానీ ఇష్టపడితే రికార్డులు కొట్టొచ్చని నడుబ్ నిరూపించాడు. ఇంతకీ నడుబ్ సాధించిన ఘనత ఏంటంటే…

కూడికలు, తీసివేతలు అయితే కొద్దిగా కష్టపడితే ఎవరైనా చేయగలరు. కానీ గుణకారాలు, భాగాహారాల విషయానికి వచ్చేసరికి మాత్రం వెనక్కి తగ్గుతారు. కానీ నడుబ్ అలా కాదు. ఒక్క నిమిషంలో 190 లెక్కలు చేసి రికార్డు కొట్టాడు. యూకేలోని లాంగ్ ఈటన్‌లో నివసించే నడుబ్ సృష్టించిన రికార్డు మామూలుది కాదు. దాదాపు ఒక్క సెకనులో మూడు ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు లెక్క. టైమ్స్ టేబుల్ రాక్ స్టార్స్ యాప్‌లో నడుబ్ ఈ ఘనత సాధించాడు. మొత్తం 700 మంది పిల్లలు తమ ఇంటి వద్ద నుంచి పాల్గొన్న ఈ పోటీలో నడుబ్ విజయం సాధించాడు.


Next Story

Most Viewed