ఉమ్మడి కరీంనగర్‌లో 117 కేసులు

by Sridhar Babu |
ఉమ్మడి కరీంనగర్‌లో 117 కేసులు
X

దిశ, వెబ్ డెస్క్ :
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడచిన 24గంటల్లో 117 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ లో వెల్లడించింది. దీని ప్రకారం.. కరీంనగర్‌లో 73, జగిత్యాలలో 3, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18, పెద్దపల్లి జిల్లాలో 23 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story